హెటిరో ఫార్మాపై కొనసాగుతున్న ఐటీ దాడులు

ABN , First Publish Date - 2021-10-07T15:47:35+05:30 IST

హైదరాబాద్: హెటిరో ఫార్మాపై ఐటీ దాడులు గురువారం కూడా కొనసాగుతున్నాయి.

హెటిరో ఫార్మాపై కొనసాగుతున్న ఐటీ దాడులు

హైదరాబాద్: హెటిరో ఫార్మాపై ఐటీ దాడులు గురువారం కూడా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు హెటిరో ల్యాబ్స్‌పై అధికారులు సోదాలు జరిపారు. కోవిడ్ 19 సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను అధికారులు పరిశీలించారు. హెటిరో డైరెక్టర్ల ఇళ్లలోను దాడులు కొనసాగాయి. అలాగే వారి పాట్నర్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సనత్‌నగర్ హెటిరో హెడ్ ఆఫీస్‌తో పాటు వైజాగ్ నక్కపల్లి మండలంలో ఉన్న హెటిరో కార్యాలయంపై కూడా ఐటి అధికారులు దాడులు చేశారు. ఇటీవల హురాన్ ఇండియా ప్రకటించిన బిలినియర్ల లిస్టులో హైదరాబాద్ నుంచి  హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారధి రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. దేశ వ్యాప్తంగా 58వ అత్యoత  ధనికుడిగా పార్థ సారథి రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-10-07T15:47:35+05:30 IST