తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు

ABN , First Publish Date - 2021-12-31T23:21:29+05:30 IST

తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. శుక్రవారం బిల్లింగ్ పూర్తయ్యే వరకు 40 లక్షల కేసుల

తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు

హైదరాబాద్: తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. శుక్రవారం బిల్లింగ్ పూర్తయ్యే వరకు 40 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. 34 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది. ఇవాళ రూ.104 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ నెలలో 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, ఇంతగా మద్యం విక్రయాలు జరగడం ఇదే తొలిసారని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో 2,764 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

Updated Date - 2021-12-31T23:21:29+05:30 IST