హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-12-09T22:17:18+05:30 IST

నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయిని పట్టుకున్నట్లు

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌: నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే డీఎస్పీ చంద్రభాను తెలిపారు. 67 లక్షల విలువైన 336 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయిని తరలిస్తున్న 14 మంది సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేశామన్నారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారన్నారు. అరకు నుంచి ముంబైకి గంజాయిని ముఠా తరలిస్తున్నదన్నారు. విశాఖ నుంచి వచ్చే ట్రైన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించామని రైల్వే డీఎస్పీ చంద్రభాను పేర్కొన్నారు. Updated Date - 2021-12-09T22:17:18+05:30 IST