Hayatnagar: సెల్ఫీ కోసం వెళ్లి యువకుడి గల్లంతు
ABN , First Publish Date - 2021-12-26T14:28:47+05:30 IST
చెక్ డ్యాంపై నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్/హయత్‌నగర్: చెక్ డ్యాంపై నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. నగరంలోని ఉప్పుగూడకు చెందిన సాయికిరణ్ (21) నాలుగు రోజుల క్రితం పెద్దఅంబర్‌పేట్ సదాశివ వెంచర్‌లో క్యాటరింగ్ చేయడానికి వచ్చాడు. శనివారం సాయంత్రం నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఫొటోలు దిగేందుకు చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు. ఓ రాయి అంచున నిల్చొని సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డాడు. ఈత రాక పోవడంతో మునిగిపోయాడు. కళ్ల ఎదుటే సాయికిరణ్ నీటిలో పడిపోవడంతో స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే హయత్‌నగర్ పోలీసులకు వారు సమాచారమిచ్చారు. పోలీసులు సాయికిరణ్ కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న సాయికిరణ్ తల్లిదండ్రులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.