తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీలోభారీ ఎత్తున హరితహారం

ABN , First Publish Date - 2021-07-08T22:50:54+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ ప్రాంగణంలో గురువారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం భారీఎత్తున జరిగినది.

తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీలోభారీ ఎత్తున హరితహారం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ ప్రాంగణంలో గురువారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం భారీఎత్తున జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి అటవీశాఖ పీసీసీఎఫ్ శోభ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, అకాడమీ సిబ్బంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శిక్షణార్ధులు (63), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శిక్షణార్ధులు (27), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిక్షణార్ధులు (38) అందరు కలసి 500 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శిక్షణార్ధులు (63) అభ్యర్ధులు హరితహారం మొక్కలు నాటడం లో ఎంతో ఉత్సాహంగా  పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి. శోభ  శిక్షణార్దులను ఉద్దేశించి మాట్లాడుతూ ఐజిఎన్ఎఫ్ఏ, డెహ్రాడున్ లో తాను పొందిన శిక్షణా కాలం (1986) గుర్తు చేసుకున్నారు. తన  శిక్షణ కాలం మరిచిపోలేనిది, ఫారెస్త్రి ఉద్యోగంకి సంబంధించిన అన్ని కార్యక్రమాల మీద అవగాహన కల్పించచారని చెప్పారు.  ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిక్షణార్ధులను మార్గదర్శకం చేస్తూ అటవీ శాఖ లో ఉద్యోగం సమజానికి చేసే సేవలాంటిదని అన్నారు. కాబట్టి అందరు అటవీ సంరక్షణ బాధ్యతాయుతంగా చేపట్టి అడవుల పునరాభివృద్దికి, అటవీ విస్తీర్ణం పెంపొందించటానికి కృషి చేసి సమాజానికి స్వచ్చమైన గాలి, వాతావరణం అందిచాలని దిశా నిర్దేశం చేసారు.   

Updated Date - 2021-07-08T22:50:54+05:30 IST