వరంగల్‌లో హనుమాన్‌ జయంతి

ABN , First Publish Date - 2021-06-05T04:59:18+05:30 IST

వరంగల్‌లో హనుమాన్‌ జయంతి

వరంగల్‌లో హనుమాన్‌ జయంతి
పద్మాక్షిరోడ్డులోని హనుమద్గిరి శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో అలంకరణలో స్వామి

వరంగల్‌ కల్చరల్‌   : హనుమాన్‌ జయంతిని వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా భక్తులు భక్తి, శ్రద్ధలతో జరుపుకున్నారు. సీతారామ, ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, చందన సేవ, హోమాలు నిర్వహించారు. హనుమాన్‌ చాలీసా, హనుమాన్‌ మూల మంత్ర పఠనం చేసి భజనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు ఆలయాల ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. అర్చకులు హనుమాన్‌ మాలధారులకు మాలవిరమణ చేశారు.

Updated Date - 2021-06-05T04:59:18+05:30 IST