డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో వెల్లంపల్లి గ్రామస్తుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-21T17:17:46+05:30 IST

జిల్లాలోని పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో వెల్లంపల్లి గ్రామస్తుల ఆందోళన

హనుమకొండ: జిల్లాలోని పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఇల్లు వచ్చాయంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి రాకముందే సర్పంచ్, ఎంపీపీతో గ్రామస్తులు గొడవకు దిగారు. పేదలకు ఇవ్వకుండా ఇల్లు ఉన్న వారికే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రాకుండా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. 

Updated Date - 2021-10-21T17:17:46+05:30 IST