తొలిరోజే తనదైన మార్కు!

ABN , First Publish Date - 2021-09-04T05:01:10+05:30 IST

తొలిరోజే తనదైన మార్కు!

తొలిరోజే తనదైన మార్కు!
మంత్రి దయాకర్‌రావును కలిసి పూలమొక్కను అందచేస్తున్న కమిషనర్‌ ప్రావీణ్య

 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య

 వెంటనే వివిధ శాఖల అధికారులతో సమావేశం

 నూతన మునిసిపల్‌ చట్టంపై అవగాహన ఉండాలని స్పష్టీకరణ

 నివేదికలతో సమీక్షలకు  సిద్దంగా ఉండాలని ఆదేశాలు

 మంత్రి, ఉన్నతాధికారులతో మర్యాదపూర్వక భేటీ

వరంగల్‌ సిటీ, సెప్టెంబరు 3: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 2:05గంటలకు ఆమె వరంగల్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 2:09 గంటలకు బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హనుమకొండ బాలసముద్రం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ప్రధాన కార్యాలయానికి వచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. నూతన మునిసిపల్‌ చట్టం-2019పై ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండకుండా చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. పూర్తయిన వివిధ అభివృద్ధి పనులు, అమల్లో ఉన్నవి, భవిష్యత్తు లక్ష్యాలు తదితర వివరాలతో ప్రతి విభాగం అధికారులు నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. విభాగాల వా రిగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆ క్రమంలో సం పూర్ణ సమాచారంతో ఉండాలని పునరుద్ఘాటించారు. 

కమిషనర్‌కు శుభాకాంక్షలు

నూతన కమిషనర్‌ ప్రావీణ్యకు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియచేశారు. పూలమొక్కలను అందచేశారు. అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్‌, ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి, సీహెచ్‌వో సునిత, సీపీ వెంకన్న, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్‌ వెంకటేశ్వరరావు, పీఆర్‌వో అయూబ్‌ అలీ, డీఎ్‌ఫవో కిషోర్‌, టీవో శాంతికుమార్‌, జేఏవో ఉమాకాంత్‌, హెచ్‌వో ప్రిసిల్లా, ఈఈలు శ్రీనివాస్‌, రాజ య్య, శ్రీనివాసరావు తదతరులు కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. అలాగే నూతన కమిషనర్‌ ప్రావీణ్యకకు బల్ది యా జేఏసీ అధ్యక్షుడు గౌరీ శంకర్‌, కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. సీపీఎం జిల్లా కమిటీ నాయకులు నూతన కమిషనర్‌ ప్రావీణ్యకు శుభాకాంక్షలు తెలియచేశారు. 

మంత్రిని కలిసిన కమిషనర్‌ 

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పి.ప్రావీణ్య మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావును హనుమకొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను అందచేశా రు. ఈ సందర్భంగా కమిషనర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. వరంగల్‌ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఫలాలు కనిపించేలా కృషి చేయాలని కమిషనర్‌కు సూచించారు. 

న్యాయమూర్తి, కలెక్టర్‌, సీపీని..

హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతును నూతన కమిషనర్‌ పి.ప్రావీణ్య కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.  కలెక్టర్‌, కమిషనర్‌ కాసేపు నగర అభివృద్ధి అంశాలను సమీక్షించారు. అలాగే జిల్లా న్యాయమూర్తి నందికొండ నర్సింగరావును కమిషనర్‌ హనుమకొండలో మర్యాదపూర్వకంగా కలిశారు.  హనుమకొండ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషిని మర్యాదపూర్వకంగా కలిశారు.Updated Date - 2021-09-04T05:01:10+05:30 IST