ఆదివాసీలపై రేవంత్‌ కపట ప్రేమ: గువ్వల బాలరాజ్

ABN , First Publish Date - 2021-08-10T23:02:20+05:30 IST

నిన్నఇంద్రవెల్లి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివాసీలపై కపట ప్రేమ చూపించారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ అన్నారు.

ఆదివాసీలపై రేవంత్‌ కపట ప్రేమ: గువ్వల బాలరాజ్

హైదరాబాద్: నిన్నఇంద్రవెల్లి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివాసీలపై కపట ప్రేమ చూపించారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ డ్రామాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. నల్లమల బిడ్డగా చెప్పుకుంటున్న రేవంత్ అచ్చంపేటకు ఒరగా బెట్టింది ఏమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్ నోరును, భాషను అదుపులో పెట్టుకోవాలని గువ్వల బాలరాజ్  హితవు పలికారు. 

Updated Date - 2021-08-10T23:02:20+05:30 IST