గురజాల రవీందర్‌రావుకు మావోయిస్టులతో సంబంధాలు: సీపీ
ABN , First Publish Date - 2021-03-22T00:22:33+05:30 IST
గురజాల రవీందర్‌రావుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సీపీ మీడియాతో మాట్లాడుతూ

మంచిర్యాల: గురజాల రవీందర్‌రావుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సీపీ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రమణ్యం దంపతులకు.. గురజాల రవీందర్‌రావు నెల రోజుల పాటు షెల్టర్ ఇచ్చారని తెలిపారు. మావోయిస్టు నేతలు బండి ప్రకాష్, భాస్కర్, వర్గీస్‌లతోనూ టచ్‌లో ఉన్నాడని, ఆధారాలతోనే రవీందర్‌రావును అరెస్ట్ చేశామని సీపీ పేర్కొన్నారు. రవీందర్‌రావు నుంచి మెమొరీ కార్డులు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మావోయిస్టు కార్యకాలపాలను సహించేది లేదని సత్యనారాయణ హెచ్చరించారు.
అయితే రవీందర్‌రావు అరెస్ట్‌ను తెలంగాణ పౌరహక్కుల సంఘం ఖండించింది. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన రవీందర్‌రావును అరెస్ట్ చేయడం అన్యాయమని సంఘం నేతలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంఘాలపై తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో భయబాంత్రులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రవీందర్‌రావును అరెస్ట్‌ను ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.