పోస్టింగులకు మార్గదర్శకాలు ఇవ్వాలి: టీచర్లు

ABN , First Publish Date - 2021-12-25T08:27:45+05:30 IST

స్థానిక క్యాడర్లకు కేటాయించిన ఉపాధ్యాయులకు పాఠశాలల్లో

పోస్టింగులకు మార్గదర్శకాలు ఇవ్వాలి: టీచర్లు

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక క్యాడర్లకు కేటాయించిన ఉపాధ్యాయులకు పాఠశాలల్లో పోస్టింగులు ఇవ్వడానికి విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం జరిగిన కమిటీ అత్యవసర సమావేశంలో సంఘ నాయకులు కె.జంగయ్య, చావ రవి, కె.రమణ, తదితరులు పాల్గొన్నారు. 


కాగా, టీచర్లకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసిన తర్వాతే బదిలీలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌ రావు, నవాత్‌ సురేశ్‌  డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచాలని తెలంగాణ స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూ) అధ్యక్షుడు అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-12-25T08:27:45+05:30 IST