జీపీఏల రిజిస్ట్రేషన్‌ మార్గదర్శకాలు జారీ

ABN , First Publish Date - 2021-02-05T08:59:01+05:30 IST

వ్యవసాయ భూములకు సంబంధించిన జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) రిజిస్ట్రేషన్ల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ధరణి పోర్టల్‌లో జీపీఏల కోసం రైతులు/భూముల యాజమానులు దరఖాస్తు చేసుకుంటే...

జీపీఏల రిజిస్ట్రేషన్‌ మార్గదర్శకాలు జారీ

వ్యవసాయ భూములకు సంబంధించిన జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) రిజిస్ట్రేషన్ల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ధరణి పోర్టల్‌లో జీపీఏల కోసం రైతులు/భూముల యాజమానులు దరఖాస్తు చేసుకుంటే.. నిర్ణీత సమయంలో తహసీల్దార్‌ ముందు వారు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత పత్రాలను పరిశీలించి..జీపీఏను తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. జీపీఏ, ఏజీపీఏ(అగ్రిమెంట్‌ సేల్‌ కమ్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ), డీజీపీఏ(డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ), ఎస్‌పీఏ(స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ)లకు అవకాశం ఇవ్వాలని రెండు నెలలుగా భూ యాజమానులు కోరుతున్నారు.

Updated Date - 2021-02-05T08:59:01+05:30 IST