సబ్‌స్టేషన్ పనులు నిలిపివేశారని రాస్తారోకో
ABN , First Publish Date - 2021-03-25T05:23:40+05:30 IST
సబ్‌స్టేషన్ పనులు నిలిపివేశారని రాస్తారోకో

అటవీశాఖ, గ్రామస్థుల మధ్య వాగ్వాదం
గూడూరు రూరల్, మార్చి 24 : గూడూరు మండలం భూపతిపేట సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని భూపతిపేట, వెంగంపేట గ్రామస్థులు బుధవారం 365 జాతీయ రహాదారిపై రాస్తారోకో చేశారు. భూపతిపేట సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని సమాచారంతో ఎఫ్‌ఆర్వో అమృత ఆదేశాలానుసారం అటవీశాఖ సెక్షన్ అధికారి జగ్గయ్య, బీట్ అధికారి నవీన్‌లు సిబ్బందితో కలిసి పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో భూపతిపేట సర్పంచ్ కవితఅశోక్, వేంగంపేట సర్పంచ్ భవానివిష్ణులు అటవీశాఖ అధికారులతో చర్చలు జరిపిన ఫలితం లేకుండ పోయింది. దీంతో అటవీశాఖ సిబ్బందితో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న గూడూ రు సీఐ రాజిరెడ్డి సంఘటన స్థలికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపి వాగ్వాదం జరిగిన ప్రదేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అ యినప్పటికి వెళ్లిపోకుండ గ్రామస్థులు 365 జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సతీష్ రాస్తారోకో స్థలికి చేరుకుని ఇరువర్గాలను పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి సానుకూలంగా చర్చలు జరుపుకోవాలని సూచించారు. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో రాస్తారోకోను విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన అటవీశాఖ అధికారులు ప్రస్తుతం నిర్మాణమవుతున్న సబ్‌స్టేషన్ నిర్మాణ స్థలాన్ని చూపించారని పేర్కొన్నారు. ఆ అధికారులు ప్రస్తుతం బదిలీపై వెళ్లడంతో ఎఫ్‌ఆర్వో అమృత, అ టవీశాఖ అధికారులు పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి పనులను అడ్డుకోవద్దని అటవీశాఖ అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. 10 గ్రామాలకు ఈ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో విద్యుత్ సమస్యలు తీరతాయని స్పష్టం చేస్తున్నారు. గ్రామస్థులు అశోక్, విష్ణు, శోభన్‌రెడ్డి, కత్తి స్వామి, రాఘవరెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.