జీఎస్టీ పెంపు చేనేత రంగానికి మరణశాసనం: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-12-25T08:03:52+05:30 IST

కేంద్ర సర్కారు జీఎస్టీ పెంపు నిర్ణయం చేనేత వస్త్ర పరిశ్రమకు

జీఎస్టీ పెంపు చేనేత రంగానికి మరణశాసనం: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సర్కారు జీఎస్టీ పెంపు నిర్ణయం చేనేత వస్త్ర పరిశ్రమకు మరణశాసనం అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ట్విటర్‌ వేదికగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మేకిన్‌ ఇండియా అంటూ రోజూ ఉపన్యాసాలిచ్చే కేంద్రం స్వదేశంలో వస్త్ర తయారీ పరిశ్రమకు సహకారమందించాల్సింది పోయి జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సరికాదన్నారు. జీఎస్టీ పెంపు నిర్ణయా న్ని ఉపసంహరించుకోవాలని, చేనేత ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన విషయంలోనూ కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, జమ్మూకాశ్మీర్‌కు ఒక నిబంధన దక్షిణాదికి మరో నిబంధనా? అని ప్రశ్నించారు.  


Updated Date - 2021-12-25T08:03:52+05:30 IST