పెళ్లైన 15 రోజులకే భర్త పలాయనం

ABN , First Publish Date - 2021-02-05T09:14:31+05:30 IST

పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలి ఆస్ర్టేలియా వెళ్లిపోయిన భర్తను వె న క్కు రప్పించి భార్యకు పోలీసులు న్యాయం చేశారు. నల్లగొండ మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ రాజశేఖర్‌ తె లిపిన వివరాల ప్రకారం...

పెళ్లైన 15 రోజులకే భర్త పలాయనం

  • ఆస్ట్రేలియా నుంచి రప్పించిన పోలీసులు


నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 4: పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలి ఆస్ర్టేలియా వెళ్లిపోయిన భర్తను వె న క్కు రప్పించి భార్యకు పోలీసులు న్యాయం చేశారు. నల్లగొండ మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ రాజశేఖర్‌ తె లిపిన వివరాల ప్రకారం పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలి ఆస్ర్టేలియా వెళ్లిపోయిన భర్తను వె న క్కు రప్పించి భార్యకు పోలీసులు న్యాయం చేశారు. నల్లగొండ మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ రాజశేఖర్‌ తె లిపిన  వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన బిందుశ్రీకి హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి  సురేశ్‌తో గత ఏడాది వివాహమైంది. తర్వాత 15 రోజులకు సురేశ్‌ ఆస్ర్టేలియా వెళ్లాడు. మళ్లీ వచ్చి భార్యను తీసుకువెళ్తానని చెప్పాడు. కానీ, ఆరు నెల లు గడిచినా తిరిగి రాలేదు. దీంతో బిందుశ్రీ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. నిందితుడి పాస్‌పోర్టు సీజ్‌ చేసేలా పాస్‌పోర్టు అధికారులకు, భారత, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాలకు సీఐ రాజశేఖర్‌ ఈ-మెయిల్స్‌ పంపారు. దీంతో కంపెనీ సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నెల 2న నిందితుడు భారత్‌ వస్తున్నాడని తెలుసుకొన్న సీఐ.. ఢిల్లీ వెళ్లారు. ఇమిగ్రేషన్‌, ఎయిర్‌పోర్టు అధికారుల సహకారంతో సురేశ్‌ను అరెస్టుచేసి తీసుకొచ్చిబాధితురాలికి న్యాయం చేశారు.


Updated Date - 2021-02-05T09:14:31+05:30 IST