గ్రీన్‌ ఫీల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T20:09:51+05:30 IST

గ్రీన్‌ఫీల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశ చైర్మన్‌, మానుకోట ఎంపీ మాలోతు కవిత అన్నారు.

గ్రీన్‌ ఫీల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

 ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలి 

మానుకోట ఎంపీ మాలోతు కవిత 

ఎన్‌హెచ్‌ అధికారులపై ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఆగ్రహం 


మహబూబాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ఫీల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశ చైర్మన్‌, మానుకోట ఎంపీ మాలోతు కవిత అన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ పరిధిలో 51 కిలో మీటర్లలో ఐదు మండలాల పరిధిలో 18 గ్రామాలు భూ నిర్వాసితులున్నారని వారికి న్యాయం చేయాలని సూచించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ శశాంక అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) కమి టీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు , వాటి అమలు తీరుపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ, దిశ చైర్మన్‌ మాలోతు కవిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వపధకాల సమీక్షలో ఉన్నతాధికారులు పాల్గొని సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ శశాం క మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించలన్నారు. 


దిశలో అంశాల వారీగా చర్చ ఇలా...

 దిశ సమావేశంలో తొలుత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై చర్చించారు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్‌ షేడ్‌లు పూర్తి చేశామని డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య వివరించారు. డోర్నకల్‌ మండ లం అమ్మపాలెంలో పెన్షన్‌లు సకాలంలో అందడం లేదని, పైన వచ్చే రూ.16 లబ్ధిదారులకు ఇవ్వడం లేదని పోస్టల్‌ అధికారులు పర్యవేక్షించాలని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌. రెడ్యానాయక్‌ అధికారులకు సూచించారు. అదే విధంగా జాతీ య రహదారులపై  సమీక్షిస్తూ  తక్షణమే రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఎన్‌హెచ్‌ ఈఈ విద్యాసాగర్‌ను ఆదేశించారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు ఇప్పటి వరకు పరిహారం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో జాతీయ రహదారులకు ప్రతిపాదనలు పంపుతున్నారా లేక పంపితే మంజూరి ఇవ్వడం లేదా అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఎన్‌హెచ్‌ అధికారులను ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు పంపామని ఐటీడీఏ డీఈ ప్రభాకర్‌ తెలిపారు. మిషన్‌ భగీరధ కింద తవ్వుతున్న సీసీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్‌ నవీన్‌రావు కోరారు.


బొడ్లాడలోరెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమస్యను పరిష్కరించాలని సర్పంచ్‌ సు ష్మ సమావేశ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్‌ శశాంక జోక్యం చేసుకుని అంగన్‌వాడీ టీచర్ల విషయమై నివేదికను అందించాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనినాను ఆదేశించారు. జిల్లాలో 100 శాతం  మెదటి డోసు కరోనా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకున్నామని డీఎంహెచ్‌వో హరీ్‌షరాజ్‌ తెలిపారు. అనంతరం నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తక్కెళ్లపల్లి రవీందర్‌రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోతు బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌రావు, దిశ సభ్యులు పర్కాల శ్రీనివా్‌సరెడ్డి కేఎ్‌సఎన్‌. రెడ్డి, ఈదురు రాజేశ్వరీ, గుగులోతు అరుణ, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌సోసైటీ జిల్లా చైర్మన్‌ పీవీ. ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T20:09:51+05:30 IST