రాజ్ భవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-11-27T00:34:28+05:30 IST

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

రాజ్ భవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రకమానికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, హై కోర్టు జడ్జిలు, మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత జాతి నిర్మాతలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ భారత జాతి ఐక్యతకు, సమగ్రతకు రాజ్యాంగం ఎంతో బాలాన్నిచ్చిందని అన్నారు భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం రక్షణగా నిలిచిందన్నారు. ప్రజా విలువలు పాటిస్తూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై వుందన్నారు. 


2016 నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. హై కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ మాట్లాడుతూ దేశంలో పాలన సజావుగా సాగేందుకు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అన్ని వర్గాల వారు పునరంకితం కావాలని అన్నారు. అంతకు ముందు గవర్నర్, చీఫ్ జస్టిస్ తో పాటు జడ్జిలు, ఇతర సీనియర్ అధికారులు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విధాన పరిషత్ ఛైర్మన్ భూపాల్ రెడ్డి, మంత్రులు కె. తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-27T00:34:28+05:30 IST