స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్‌

ABN , First Publish Date - 2021-11-21T08:22:51+05:30 IST

స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్‌ పాల్గొన్నదని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని

స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్‌

  • హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వెల్లడి
  • వచ్చే ఏడాది ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’
  • ఏడాది పొడవునా జరపాలి: కిషన్‌రెడ్డి


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్‌ పాల్గొన్నదని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో రెండు రోజుల గోల్కొండ సాహితీ మహోత్సవ్‌ ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రతన్‌ శార్దా రచించిన ‘స్వరాజ్య సాధనలో ఆరెస్సెస్‌’, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రచించిన ‘నిజాం రూల్‌ అన్‌మా్‌స్కడ్‌’, సారంగపాణి రాసిన ‘ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడీ’ పుస్తకాలను ఈ సందర్భంగా దత్తాత్రేయ ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌తో పాటు వందల మంది స్వయంసేవకులు 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లిన విషయం ‘స్వరాజ్య సాధనలో ఆరెస్సెస్‌’ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ పుస్తకం ఆరెస్సెస్‌పై అసత్య ప్రచారాలకు గట్టి బదులు అవుతుంది’’ అని దత్తాత్రేయ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది 75 ఏళ్ల హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఏడాది పొడవునా జరపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఆరెస్సెస్‌ అఖిలభారతీయ కార్యకారిణి సదస్యులు వడ్ల భాగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T08:22:51+05:30 IST