గుస్సాడీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన కనకరాజు- గవర్నర్‌

ABN , First Publish Date - 2021-02-01T22:32:51+05:30 IST

గిరిజనుల సాంప్రదాయక నృత్యమైన గుస్సాడీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చిన వ్యక్తి కనకరాజు అని గవర్నర్‌

గుస్సాడీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన కనకరాజు- గవర్నర్‌

హైదరాబాద్‌: గిరిజనుల సాంప్రదాయక నృత్యమైన గుస్సాడీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చిన వ్యక్తి కనకరాజు అని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం కనకరాజును పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిననేపధ్యంలో ఆయనను గవర్నర్‌ తమిళిసై సోమవారం ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం తనకు ఎంతో గర్వకారణంగా వుందన్నారు. ఆదివాసీ సంప్రదాయాలు గౌరవించబడాలనేది తన ఆకాంక్ష అని గవర్నర్‌ పేర్కొన్నారు. 


తాను గవర్నర్‌ కాకముందు నుంచే గిరిజనులతో ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎప్పుడూ వారి సంక్షేమాన్ని కోరుకుంటానని అన్నారు. గిరిజనుల వైద్యానికి ప్రత్యేకత వుందని, వారి వైద్యంపై పరిశోధన చేయాలన్నారు. గిరిజనులకు పద్మశ్రీ పురస్కారంతో కేంద్రం గౌరవించడం నిజంగా ఎంతో సంతోషకరమైన విషయమని గవర్నర్‌ అన్నారు. 


Updated Date - 2021-02-01T22:32:51+05:30 IST