కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గవర్నర్ అభినందనలు

ABN , First Publish Date - 2021-07-08T21:01:00+05:30 IST

కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గవర్నర్ అభినందనలు

హైదరాబాద్: కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుండి కేంద్ర కేబినెట్ లో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలంగాణ బిడ్డగా  కిషన్ రెడ్డి ఎదుగుదల పట్ల తెలంగాణ గర్వపడుతున్నదని గవర్నర్ అన్నారు. టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి భారత దేశ సేవ లో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ గారు ఆకాంక్షించారు. 


Updated Date - 2021-07-08T21:01:00+05:30 IST