ప్రభుత్వాలు ఓబీసీ లెక్కలు ఎందుకు చేపట్టడం లేదు: వీహెచ్

ABN , First Publish Date - 2021-08-27T20:13:41+05:30 IST

ప్రభుత్వాలు ఓబీసీ లెక్కలు ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తప్పుబట్టారు.

ప్రభుత్వాలు ఓబీసీ లెక్కలు ఎందుకు చేపట్టడం లేదు: వీహెచ్

ఢిల్లీ: ప్రభుత్వాలు ఓబీసీ లెక్కలు ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఓబీసీ లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు మాత్రమే క్రిమీలేయర్ ఎందుకని చాలాసార్లు ప్రశ్నించామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సకల జనుల సర్వే చేపట్టిందని, అందులో 54శాతం ఓబీసీలు ఉన్నారన్నారని తెలిపిందన్నారు. కానీ వివరాలు మాత్రం బయటపెట్టడం లేదని ఆయన విమర్శించారు. కులాల గణాంకాలపై సీఎం నితీష్‌కుమార్ ఎలా తీర్మానం చేశారో.. అదే విధంగా తెలంగాణలో కేసీఆర్ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు, రైతుబంధు తరహాలో బీసీబంధు అంటున్నారని, అది అమలు చేయాలన్నా.. లెక్కలు కావాలన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీ లెక్కలు చేపట్టేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని హనుమంతరావు చెప్పారు.

Updated Date - 2021-08-27T20:13:41+05:30 IST