ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: దౌల్తాబాద్ ఎంపీపీ
ABN , First Publish Date - 2021-10-29T22:50:38+05:30 IST
జల్లాలోని దౌల్తాబాద్ మండలంలలోని అధికారుల తీరు ఇలాగే కొనసాగితే తాను

సిద్దిపేట: జల్లాలోని దౌల్తాబాద్ మండలంలోగల అధికారుల తీరు ఇలాగే కొనసాగితే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని ఎంపీపీ గంగాధరి సంధ్య ప్రకటించారు. ఒక దళిత మహిళగా, ఎంపీపీగా మండల అధికారులు తనను అవమానపరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. పంచాయతీ సెక్రటరీ నుంచి ఎంపీడీఓ వరకు తన మాట లెక్కచేయడం లేదని ఆమె మండిపడ్డారు. అధికారుల తీరు ఇలాగే కొనసాగితే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. మండలంలో అధికారులు ప్రోటోకాల్‌ను పాటించడం లేదని ఆరోపించారు. అధికారుల తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీపీ గంగాధరి సంధ్య పేర్కొన్నారు.