గోరటి సాహిత్యం.. మానవుని వేదనకు అద్దం
ABN , First Publish Date - 2021-12-31T08:37:34+05:30 IST
ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, మండలి సభ్యుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

కేసీఆర్ హర్షం
హైదరాబాద్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, మండలి సభ్యుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ’వల్లంకి తాళం’ కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్పవిషయమన్నారు. అవార్డుకు ఎంపికైన గోరటి వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపారు.దైనందిన జీవితంలోని ప్రజాసమస్యలను సామాజిక తాత్వికతతో కళ్లకు కడుతూ అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందన్నారు. ‘నేను అంటే ఎవరు’ అనే నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారాన్ని దక్కించుకున్న ప్రముఖ రచయిత దేవరాజు మహారాజుకు, ‘దండకడియం’ రచనకు సాహిత్య అకాడమీ యువపురస్కార్ అవార్డు దక్కించుకున్న తగుళ్లగోపాల్‌ను కేసీఆర్ అభినందించారు. పురస్కారాలు సాధించిన ముగ్గురికి మంత్రులు హరీశ్, కేటీఆర్, శ్రీనివా్‌సగౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ శుభాకాంక్షలు తెలిపారు.