వేతన సవరణలో గోపాలమిత్రలను చేర్చాలి: సంఘం
ABN , First Publish Date - 2021-01-12T08:56:24+05:30 IST
గోపాలమిత్రలకు కొత్త వేతన సవరణలో అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్రల సంఘం అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చక్రపాణి..

గోపాలమిత్రలకు కొత్త వేతన సవరణలో అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్రల సంఘం అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చక్రపాణి.. మంత్రి తన్నీరు హరీశ్‌రావును సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు ఉద్యోగ భద్రత, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,350 మంది గోపాలమిత్రలకు రాబోయే నోటిఫికేషన్ ప్రక్రియలో 50 శాతం వెయిటేజీ కల్పించి వెటర్నరీ అసిస్టెంట్లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు.