గొల్ల కురుమల సంక్షేమానికి కృషిచేస్తా: బాలరాజ్
ABN , First Publish Date - 2021-12-31T08:15:51+05:30 IST
రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా డా. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

కార్వాన్/హైదరాబాద్, డిసెంబర్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా డా. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ప్రధా న కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్, జగదీ్‌షరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్ సమక్షంలో బాలరాజ్ యాదవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. గొర్రెలు, మేకల పెంపకందారులు, గొల్ల కురుమలు, యాదవ సోదరుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని బాలరాజ్ యాదవ్ హామీ ఇచ్చారు.