గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సలో యాచకుల వీరంగం

ABN , First Publish Date - 2021-11-27T05:16:36+05:30 IST

గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సలో యాచకుల వీరంగం

గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సలో యాచకుల వీరంగం
గొంతు వద్ద గాయంతో వెంకటేశ్వర్‌రావు, దాడి చేసిన మరో యాచకుడు అర్జున్‌


షేవింగ్‌ కత్తులతో పరస్పరం దాడులు

యాచకుడికి తెగిన గొంతు

గాయాలతో రైలులో వేలాడుతూ ప్రయాణం

గిర్మాజిపేట/నెక్కొండ, నవంబరు 26 : వైట్‌నర్‌ మత్తులో మానసిక రోగులైన ఇద్దరు యాచకులు షేవింగ్‌ చేసుకునే కత్తులతో ఒకరిపై ఒకరు పరస్ప ర దాడులకు పాల్పడుతూ వీరంగం సృష్టించారు. ఆ గాయాలతోనే రైల్‌ డోర్‌కు వేలాడుతూ ప్రయాణించడం.. మధ్యలో రైలు నెమ్మదించడంతో యాచకులు.. ప్రయాణికులపై రాళ్లదాడికి దిగడం శుక్రవా రం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్‌ కవాడిగూడకు చెందిన చిలుకలూ రి అర్జున్‌(23), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీశైలంకు చెం దిన గుంటూరు వెంకటేశ్వర్లు(30) రైళ్లలో కోచ్‌లు శుభ్రంచేస్తూ, ప్రయాణికులను డబ్బులు అడుక్కుం టూ జీవిస్తుంటారు. వైట్‌నర్‌, బొనిఫిక్స్‌ (టైర్ల పం చర్లు అతికించేందుకు వినియోగించేది) వాసనను పీల్చుతూ మత్తుకు బానిసలయ్యారు. వీరు నిత్యం రైళ్లలో తిరుగుతూ ఈ మత్తులోనే జోగుతుంటారు. శుక్రవారం ఉదయం మత్తులో ఉన్న అర్జున్‌, వెంకటేశ్వర్‌రావు.. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ ప్రెస్‌ డి-1 కోచ్‌లో ఎక్కారు. గడ్డం, జుత్తు బాగా పెంచుకుని మాసిన బట్టలతో మత్తులో జోగుతు న్న ఈ ఇద్దరిని చూడగానే కోచ్‌లోని ప్రయాణికు లు భయంతో వీరికి దూరంగా ఉన్నారు. 

ఉదయం 10.01 గంటలకు కేసముద్రం నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఎమైందో ఏమోగానీ ఇంటికన్నె స్టేషన్‌కు చేరుకున్న సమయంలో అర్జున్‌, వెంకటేశ్వర్‌రావు ఒక్కసారిగా కేకలు వేస్తూ తమ వద్ద ఉన్న షేవింగ్‌ కత్తులతో ఒకరినొకరు దాడులు చేసుకున్నారు. అర్జున్‌ తనవద్ద ఉన్న కత్తి తో వెంకటేశ్వర్‌రావు గొంతు కోయగా, వెంకటేశ్వర్‌రావు తన కత్తితో అర్జున్‌ చేతులపై దాడి చేశాడు. సుమారు ఉదయం 10.18గంటలకు రైలు వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో కోచ్‌లోని ప్రయాణికులంతా రైల్వే అధికారుల దృష్టికి తెచ్చారు. ఇతర కోచ్‌ల ప్రయాణికులు సైతం రైలు దిగి డి-1 కోచ్‌ వద్దకు చేరారు. దాడులు చేసుకున్న యాచకులను రైలు నుంచి దించాలని రైల్వే అధికారులను డిమాండ్‌ చేశారు.  

ప్రయాణికుల ఒత్తిడితో గాయాలతో మత్తులోనే ఉన్న అర్జున్‌, వెంకటేశ్వర్‌రావులు రైలు దిగడంతో 20నిమిషాల అనంతరం రైలు బయల్దేరింది. అయి తే రైలు బయలుదేరుతుండగా ఆ ఇద్దరు యాచకు లు పరుగెత్తుకుంటూ వచ్చి డోర్‌ మూసి ఉన్న కోచ్‌ ఎక్కి కోచ్‌డోర్‌కు వేలాడుతునే ప్రయాణించారు. సుమారు అరగంట ప్రయాణం తర్వాత వరంగల్‌ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రైల్వేస్టేషన్‌లో సాంకేతిక కారణాలతో కొద్దిక్షణాలు స్లో అవడంతో అర్జున్‌, వెంకటేశ్వర్‌రావులు రైలు దిగారు. ఒక్కసారిగా ఇద్దరు యాచకులు పట్టాలపై ఉన్న కంకర రాళ్లతో ప్రయాణికులపై దాడి చేశారు. భయాందోళనతో ప్రయాణికులు కిటికీ లు, డోర్లు మూయడంతో ఎవరికీ గాయాలు కాలేదు. రాళ్ల దాడిలో ఓ కోచ్‌ అద్దం పగిలింది. 

గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సలో యాచకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్న సమాచారంతో వరంగల్‌ జీఆర్‌పీ సీఐ నరేష్‌ సిబ్బందితో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం పై సిద్ధంగా ఉన్నారు. గాయపడ్డ యాచకులు ఎల్గూరురైల్వేసేషన్‌లో దిగారనే సమాచారం రావడంతో సీఐ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు సదానం దం, రహమత్‌ అలీ, రంజిత్‌ కుమార్‌, ఆర్పీఎఫ్‌ కానిస్టేబల్‌ రవి ఎల్గూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుని అర్జున్‌, వెంకటేశ్వర్‌రావులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సదరు యాచకులు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నందున వారిపై కేసు నమోదు చేయలేదని సీఐ నరేష్‌ విలేఖరుల కు తెలిపారు.  

అడ్డుకోబోయిన ప్రయాణికుడికి గాయాలు

గోల్కొండ రైలు ఇంటికన్నె స్టేషన్‌కు చేరుకున్న సమయంలో బోగిలో డోరు వద్ద కూర్చున్న యాచకులు దాడి చేసుకుంటూ, బోగిలోని ప్రయాణికుల వైపు పరిగెత్తుకుంటూ వస్తుండగా ఓ ప్రయాణికు డు వారిని అడ్డున్నాడు. దీంతో అతడిపైనా వారు కత్తితో దాడి చేయడంతో ఆ ప్రయాణికుడి చేతికి గాయమైంది. కాగా ఆ ప్రయాణికుడి పూర్తి వివరా లు తెలియరాలేదు.Updated Date - 2021-11-27T05:16:36+05:30 IST