వైభవంగా గోదాదేవి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T04:22:01+05:30 IST

వైభవంగా గోదాదేవి కల్యాణం

వైభవంగా గోదాదేవి కల్యాణం
కాళేశ్వరంలో కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మహదేవపూర్‌, జనవరి 13 : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర, ముక్తేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన రామాలయంలో బుధవారం గోదాదేవి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకుడు ఆరుట్ల రామాచారి ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది. ఆలయ ఈవో మారుతి, జడ్పీటీసీ గుడాల అరుణ, సర్పంచ్‌ వసంత, ఎంపీటీసీ మమత, అర్చకులు త్రిపురారి కృష్ణమూర్తి శర్మ, నగేష్‌ శర్మ, వేద పండితుడు పాండే, మాజీ సర్పంచ్‌లు రాంరెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని గడ్చిరోలి డీఐజీ మానసరాజన్‌ కుటుంబ స మేతంగా  కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో పూజలు చేశారు.

గణపురం : మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామాలయంలో గోదారంగనాథ స్వామి కల్యాణ మహత్సవాన్ని నిర్వహించారు. ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య హాజరై స్వామి వారికి ప్రత్యేక పూలు చేశారు. ప్రధాన అర్చకులు, వేద పండితులు గోవర్ధన దుర్వాసాచార్యులు, శ్రీనివాసాచార్యులు ఆయనకు స్వాగతం పలికారు. ఎస్సైలు శేశాల రాజన్‌బాబు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-14T04:22:01+05:30 IST