భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ABN , First Publish Date - 2021-08-21T23:47:44+05:30 IST

ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. శుక్రవారం 22.3 అడుగులున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం:  ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. శుక్రవారం 22.3 అడుగులున్న గోదావరి నీటిమట్టం శనివారం 25 అడుగులకు చేరుకుంది.  భద్రాచలం వద్ద గోదావరినీటిమట్టం మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గోదావరి స్నానఘట్టాల వద్ద స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.

Updated Date - 2021-08-21T23:47:44+05:30 IST