గోదావరి - కావేరి అనుసంథానంపై ఇవాళ హైదరాబాద్‌లో సమావేశం
ABN , First Publish Date - 2021-10-29T16:20:58+05:30 IST
గోదావరి - కావేరి అనుసంథానంపై ఇవాళ హైదరాబాద్‌లో సమావేశం జరగనుంది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండో సంప్రదింపుల భేటీ సమావేశంలో

హైదరాబాద్: గోదావరి - కావేరి అనుసంథానంపై ఇవాళ హైదరాబాద్‌లో సమావేశం జరగనుంది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండో సంప్రదింపుల భేటీ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాల అధికారులు పాల్గొననున్నారు. సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు పాల్గొననున్నారు. హైదరాబాద్ జలసౌధ వేదికగా ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. దృశ్య మాధ్యమం ద్వారా ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొననున్నారు.