పోడుకు హక్కు పత్రాలు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-11-09T08:07:18+05:30 IST

తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలివ్వాలని ఏజెన్సీ ప్రాంతంలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులు మహబూబాబాద్‌లో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

పోడుకు హక్కు పత్రాలు ఇవ్వండి

మహబూబాబాద్‌లో 2 వేల మంది రైతుల ఆందోళన 

మహబూబాబాద్‌ టౌన్‌, నవంబరు 8 : తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలివ్వాలని ఏజెన్సీ ప్రాంతంలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులు మహబూబాబాద్‌లో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల మండలాలకు చెందిన సుమారు రెండు వేల మంది రైతులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మానుకోటకు భారీగా తరలివచ్చారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి వేలాది మంది గిరిజనేతర పోడు రైతులు కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. మూడు కొట్ల సెంటర్‌కు చేరుకోగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి గంటపాటు ఆందోళన చేపట్టారు. అనంతరం రైతుల ప్రతినిధి బృందం కలెక్టరేట్‌కు చేరుకుని అదనపు కలెక్టర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసింది.  

Updated Date - 2021-11-09T08:07:18+05:30 IST