ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వండి: సీపీఎం

ABN , First Publish Date - 2021-08-21T06:51:01+05:30 IST

రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని, జాబ్‌క్యాలెండర్‌ను విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వండి: సీపీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని, జాబ్‌క్యాలెండర్‌ను విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, పెండింగ్‌ స్కాలర్‌షి్‌పలు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు తదితర  డిమాండ్లతో  ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కమిటీలు శుక్రవారం ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. జిల్లాల నుంచి వస్తున్న వందలమంది కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టులు చేశారని తెలిపారు. ప్రగతిభవన్‌ వరకు వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులను పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారని ఆరోపించారు. 

Updated Date - 2021-08-21T06:51:01+05:30 IST