ఫ్లెక్సీలను తొలగించిన జీహెచ్‌ఎంసీ
ABN , First Publish Date - 2021-07-08T07:49:12+05:30 IST
రేవంత్‌కు మద్దతుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ శేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, ఏర్పాటు చేశారు. దారి పొడవునా జెండాలు

రేవంత్‌కు మద్దతుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ శేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, ఏర్పాటు చేశారు. దారి పొడవునా జెండాలు పెట్టారు. అయితే బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు.. బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ సమయంలో కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు. రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి వికారాబాద్ నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల కాన్యాయ్‌పై పోలీసులు నిఘానేత్రం పెట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తుండటాన్ని చూసి కాంగ్రెస్ నేతలు అవాక్కయ్యారు. ఇక మేడ్చల్ నుంచి ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్ ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా కార్యకర్తలు మేడ్చల్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపటి తరువాత పోలీసులు వారిని వదిలిపెట్టారు.
రేవంత్ బాధ్యతల స్వీకరణలో భాగస్వామ్యం అయ్యేందుకు నగరంతోపాటు శివారు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో జూబ్లీహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమీటరు వరకు వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యామ్నయ దారుల్లో వాహనాలను మళ్లించారు.