మానవ మనుగడకు జన్యు పరిశోధనలు దోహదం

ABN , First Publish Date - 2021-08-27T09:35:46+05:30 IST

ప్రమాదకరంగా మారుతున్న వాతావరణం మానవ మనుగడకు ముప్పుగా మారుతోందని, జన్యు పరిశోధనలే మానవ మనుగడకు దోహదం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

మానవ మనుగడకు జన్యు పరిశోధనలు దోహదం

జీనోమిక్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్‌ 


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ప్రమాదకరంగా మారుతున్న వాతావరణం మానవ మనుగడకు ముప్పుగా మారుతోందని, జన్యు పరిశోధనలే మానవ మనుగడకు దోహదం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఎన్నడూలేని విధంగా జన్యు పరిశోధనపై పరిశోధన సంస్థలకు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా జన్యుపరిశోధనలు చేస్తున్న న్యూక్లోమ్‌ ‘ఎన్‌కేసీ సెంటర్‌ ఫర్‌ జీనోమిక్స్‌ రిసెర్చ్‌’ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశాన్ని పంపారు. ప్రస్తుతం త్రీజీ టెక్నాలజీలో మనం తొమ్మిదో స్థానంలో ఉన్నామని, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్‌కేసీ జీనోమ్‌ సెంటర్‌ కొవిడ్‌ జీనోమ్‌పై పనిచేయడం ఆనందకరమన్నారు. వ్యాక్సిన్‌ను మెరుగుపరిచేందుకు ఈ పరిశోధనలు ఉపకరిస్తాయన్నారు.  ఈ పరిశోధన కేంద్రాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ సీఎంశివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ జన్యు పరిశోధనలతో ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. 

Updated Date - 2021-08-27T09:35:46+05:30 IST