జీఎస్టీపై అపరాధ రుసుము, వడ్డీ మాఫీ
ABN , First Publish Date - 2021-02-06T09:20:08+05:30 IST
జీఎస్టీపై అపరాధ రుసుము, వడ్డీ మాఫీ

జీఎస్టీని గడువులోగా చెల్లించకపోతే విధించే అపరాధ రుసుము, వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో వ్యాపారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నందున 2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జీఎస్టీపై విధించిన వడ్డీ, అపరాధ రుసుమును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.