హుజురాబాద్‌ ఓటమికి నైతిక బాధ్యత నాదే: గెల్లు శ్రీనివాస్

ABN , First Publish Date - 2021-11-03T01:44:46+05:30 IST

హుజురాబా‌లో టీఆర్ఎస్ ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తనను ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని ..

హుజురాబాద్‌ ఓటమికి నైతిక బాధ్యత నాదే: గెల్లు శ్రీనివాస్

కరీంనగర్: హుజురాబా‌ద్‌లో టీఆర్ఎస్ ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తనను ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. నైతికంగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. హుజురాబాద్ అభివృద్ధికి పాటు పడుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయ్యడం ఖాయమన్నారు. ఓ విద్యార్థికి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఓటమిని అంగీకరిస్తూ బీజేపీ అభ్యర్థి గెలుపును స్వాగతిస్తున్నానని గెల్లు శ్రీనివాస్ తెలిపారు. Updated Date - 2021-11-03T01:44:46+05:30 IST