అపజయాలకు భయపడొద్దు: కృష్ణ ప్రసాద్
ABN , First Publish Date - 2021-08-29T18:51:28+05:30 IST
అపజయలకు భయపడకుండా అవకాశాలను సృష్టించుకోవాలని చిగురుపాటి కృష్ణ ప్రసాద్ యువతకు పిలుపు ఇచ్చారు.
హైదరాబాద్: అపజయలకు భయపడకుండా అవకాశాలను సృష్టించుకోవాలని గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ చిగురుపాటి కృష్ణ ప్రసాద్ యువతకు పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ గీతం విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. జీవితంలో వైఫల్యం వస్తే అధైర్యపడొద్దన్నారు. వైఫల్యం పునాదులపైనే భవిష్యత్తును నిర్ణయించుకోవాలని యువతకు కృష్ణ ప్రసాద్ సూచించారు.
245 యూజీ, పీజీ డాక్టర్ల కోర్సుల్లో 1445 మంది అధ్యాపకులతో.. 23వేల మంది రెగ్యులర్.. 80 వేల మంది దూరవిద్యను అభ్యసిస్తున్నట్లు గీతం ఉపకులపతి రామకృష్ణ తెలిపారు. యూనివర్శిటీ ఆధ్వర్యంలో 15 వందల మంది విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరంలో ఆన్ లైన్ బోధనను గీతం చేపట్టిందని అందుకు తగిన టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు శివరామకృష్ణ తెలిపారు.