సంతలో డెలివరీ చేసిన గాంధీ వైద్యుడు

ABN , First Publish Date - 2021-01-12T12:33:45+05:30 IST

కీసర మండల కేంద్రంలో ప్రతీ సోమవారం సంత జరుగుతుంది.

సంతలో డెలివరీ చేసిన గాంధీ వైద్యుడు

హైదరాబాద్/కీసర/అడ్డగుట్ట : కీసర మండల కేంద్రంలో ప్రతీ సోమవారం సంత జరుగుతుంది. కుషాయిగూడకు చెందిన ఎంగువే శ్యామల, రాజే సంతలో పాత దుస్తులు అమ్ముతుంటారు. శ్యామల నిండు గర్భిణి. సాయంత్రం అనుకోకుండా నొప్పులు ప్రారంభం అయ్యాయి. స్థానికులు 108కు ఫోన్‌ చేశారు. ఈలోగా స్థానికులు చీరలు అడ్డుపెట్టి ఆమెకు సపర్యలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కీసర మీదు గా వెళ్తున్న ఓ కారుపై డాక్టర్‌ స్టిక్కర్‌ ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆ కారు ఆపారు. కారులో ఉన్న గాంధీ ఆస్పత్రి డాక్టర్‌ అర్జున్‌ గర్భిణి వద్దకు చేరుకుని వైద్య సహాయం అందించారు. శిశువు డెలీవరీకి సహకరించారు. ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్‌లో మెరుగైన పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్‌ అర్జున్‌ చెప్పారు.

Updated Date - 2021-01-12T12:33:45+05:30 IST