గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకం
ABN , First Publish Date - 2021-10-28T14:44:42+05:30 IST
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకం వెలుగు చూసింది.
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకం వెలుగు చూసింది. ప్రేమను నిరాకరించిందని ప్రేమ సింగ్ అనే యువకుడు యువతి ఇంటిలో చొరబడి ఆమెను బంధించి.. గొంతు, చేతి మణికట్టు వద్ద కట్ చేశాడు. అమ్మాయి అరుపులతో బంధువులు, స్థానికులు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. భాదితురాలిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.