గర్భిణులకు ఉచిత క్యాబ్‌ సేవలు

ABN , First Publish Date - 2021-05-20T08:51:56+05:30 IST

లాక్‌డౌన్‌ సమ యంలో గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లి, తిరిగి ఇంటికి చేర్చేందుకు ఉచిత క్యాబ్‌ సేవలను అందిస్తున్నామని యాప్‌ ఆధారిత భారతీయ రవాణా సమాఖ్య (ఐఎఫ్‌ఏటీ) ప్రధాన కార్యదర్శి షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు.

గర్భిణులకు ఉచిత క్యాబ్‌ సేవలు

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమ యంలో గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లి, తిరిగి ఇంటికి చేర్చేందుకు ఉచిత క్యాబ్‌ సేవలను అందిస్తున్నామని యాప్‌ ఆధారిత భారతీయ రవాణా సమాఖ్య (ఐఎఫ్‌ఏటీ) ప్రధాన కార్యదర్శి షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు.  ఇప్పటి వరకు 22 మంది గర్భిణీ మహిళలకు ఈ సేవలు అందించామని ఆయన పేర్కొన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఐదు క్యాబ్‌లను సిద్ధంగా ఉంచామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం సకాలంలో క్యాబ్‌ సేవలు లభించకపోవడంతో తన భార్య ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నగరంలో ఉన్న గర్భిణీ మహిళలు ఆస్పత్రికి వెళ్లేందుకు 91776 24678 నంబరుకు కాల్‌ చేస్తే వారు చెప్పిన చిరునామాకు సర్వీస్‌ క్యాబ్‌ చేరుకుంటుందని తెలిపారు. యాప్‌ బేస్డ్‌ క్యాబ్‌ సేవలందిస్తున్నందున ప్రయాణం కూడా సురక్షితంగా ఉంటుందని చెప్పారు. ఈ సేవలు అవసరమైన వారు క్యాబ్‌ డ్రైవర్‌కు సంబంధిత ఆస్పత్రి పత్రాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది కూడా క్యాబ్‌ డ్రైవర్లలో పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి యూనియన్‌ తరపున నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-05-20T08:51:56+05:30 IST