అమెరికాలో ఉద్యోగాల పేరిట మోసం

ABN , First Publish Date - 2021-11-02T09:01:53+05:30 IST

అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను బురిడీ కొట్టించి వారి వద్ద రూ. 4 కోట్లు కాజేసిన ఘరానా మోసగాణ్ని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాలో ఉద్యోగాల పేరిట మోసం

  • నగరవాసుల నుంచి రూ. 4 కోట్ల దోపిడీ..  
  • పోలీసుల అదుపులో నిందితుడు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను బురిడీ కొట్టించి వారి వద్ద రూ. 4 కోట్లు కాజేసిన ఘరానా మోసగాణ్ని సీసీఎస్‌ పోలీసులు  అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన డిటెక్టివ్‌ విభాగం అధికారులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన తిప్పులరెడ్డి భాస్కర్‌ రెడ్డి అమీర్‌పేటలో డొమైన్‌ నెట్‌వర్క్‌ జోన్‌ పేరిట ఓ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశాడు. కంప్యూటర్‌ శిక్షణతో పాటు ఆసక్తి కల వారికి అమెరికాలో వీసాతో పాటు ఉద్యోగాలిప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులు అతడిని సంప్రదించారు. ఖర్చుల పేరిట.. పలు దఽఫాల్లో వారందరి వద్దా కలిపి మొత్తంగా రూ. 4 కోట్లను వసూలు చేశాడు. డబ్బులు చెల్లించిన తర్వాత కూడా అతను అమెరికా వీసా, ఉద్యోగం ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు నిలదీశారు. సమాధా నం దాటవేస్తుండటంతో అతడి తీరుపై అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడిని చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో పట్టుకున్నారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తరలించి, సోమవారం కోర్టులో హాజరు పరచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-11-02T09:01:53+05:30 IST