ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ

ABN , First Publish Date - 2021-09-02T21:29:11+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి గురువారం మధ్యహ్నాం సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో టీఆర్ఎస్‌కు కేటాయించిన స్థలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. కార్యాలయం కోసం కేంద్రం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. ఎంపీలకు అనుగుణంగా స్థలం కేటాయింపు జరిగింది.

Updated Date - 2021-09-02T21:29:11+05:30 IST