కాషాయం ధరించిన మాజీ దళకమాండర్‌

ABN , First Publish Date - 2021-02-06T06:10:44+05:30 IST

పోడు భూముల పట్టాల సాధన, పెద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు భుజాన తుపాకీ వేసుకుని అడవి మార్గంలో నడిచిన ఎన్డీ దళ మాజీ కమాండర్‌..

కాషాయం ధరించిన మాజీ దళకమాండర్‌

గుండాల, ఫిబ్రవరి 5: పోడు భూముల పట్టాల సాధన, పెద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు భుజాన తుపాకీ వేసుకుని అడవి మార్గంలో నడిచిన ఎన్డీ దళ మాజీ కమాండర్‌.. నేడు అదే పోడుపట్టాల కోసం కాషాయం ధరించాడు.  పదేళ్లపాటు ఎన్డీలో దళ కమాండర్‌గా పనిచేసిన గణే్‌ష జనజీవన స్రవంతిలోకి వచ్చి పోడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన భూములతో పాటు ఇతర రైతుల భూముల్లో అటవీశాఖ అధికారులు హరితహారం కింద మొక్కలు నాటేందుకు సర్వే నిర్వహించడంతో సమస్యను సీఎం కేసీఆర్‌కు వివరించేందుకు శాంతిమార్గంలో వెళ్లాలని భావించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలువురు యువకులతో కలిసి పోడు భూముల హక్కుల సాధన కోసం సీఎంను కలవాలని బైక్‌పై పయనమయ్యాడు. 

Updated Date - 2021-02-06T06:10:44+05:30 IST