తెలంగాణను కేసీఆర్ దోచుకుంటున్నారు: మధుయాష్కీ

ABN , First Publish Date - 2021-02-08T21:43:10+05:30 IST

తెలంగాణ ఏర్పాటులో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర కీలకం అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. ఉస్మానియా

తెలంగాణను కేసీఆర్ దోచుకుంటున్నారు: మధుయాష్కీ

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటులో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర కీలకం అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన మాట్లాడారు. ‘ఆంధ్రులు తెలంగాణను దోచుకుంటున్నారు అన్న కేసీఆర్.... ఇప్పుడు ఆయనే దోచుకుంటున్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారు. మనందరం తెలంగాణ లిబరేషన్ ఫ్రంట్‌గా ఏర్పడాల్సిన అవసరం ఉంది. దొర దోపిడీనీ ఎదుర్కోవాలి. సాధించుకుంది సగం తెలంగాణ.. సాధించాల్సింది సంపూర్ణ తెలంగాణ. 50 వేల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంతా ఎన్నికల కోసమే. తెలంగాణ రాబందుల పార్టీ(టీఅర్ఎస్)నీ బొంద పెట్టాల్సిన అవసరం ఉంది’ అని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-02-08T21:43:10+05:30 IST