ఎంఐఎం మాజీ నేత ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-03-24T23:02:11+05:30 IST

ఆదిలాబాద్ జిల్లా జైలులో ఎంఐఎం మాజీ నేత ఫారూఖ్ అహ్మద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్పుల కేసులో డిసెంబర్ 18 నుంచి ఫారూఖ్

ఎంఐఎం మాజీ నేత ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఎంఐఎం మాజీ నేత ఫారూఖ్ అహ్మద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్పుల కేసులో డిసెంబర్ 18 నుంచి ఫారూఖ్ అహ్మద్ రిమాండ్‌లో ఉన్నారు. మెరుగైన వైద్య కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. ఫారూఖ్ తన తలను గోడకు బాదుకున్నాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఒత్తిడితో ఫారూఖ్‌ను జైలు సిబ్బంది టార్చర్ చేస్తున్నారని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్నతమపై రాజకీయ కక్ష పెంచుకున్నారని, ఎస్పీ వారియర్ కూడా వన్‌సైడ్‌గా పనిచేస్తున్నారని ఫారూఖ్ తమ్ముడు బేగ్ ఆరోపించారు.

Updated Date - 2021-03-24T23:02:11+05:30 IST