అటవీ ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-12-30T22:10:46+05:30 IST

అటవీశాఖలో సెక్షన్ అధికారులుగా ఎంపికై, ఆరు నెలల శిక్షణను ముగించుకున్న 27 మంది అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ తెలంగాణ ఫారెస్ట్ అకాడెమీ – దూలపల్లిలో జరిగింది.

అటవీ ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

హైదరాబాద్: అటవీశాఖలో సెక్షన్ అధికారులుగా ఎంపికై, ఆరు నెలల శిక్షణను ముగించుకున్న 27 మంది అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ తెలంగాణ ఫారెస్ట్ అకాడెమీ – దూలపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ హాజరయ్యారు.ట్రైనీలు నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. పర్యావరణ మార్పులు, అడవులపై ఒత్తిడి కారణంగా అటవీ అధికారులు, ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిందని, విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని పీసీసీఎఫ్ కోరారు. 


రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపు, అడవుల రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సమర్థులుగా పనిచేయాలని సూచించారు. 27 మంది అధికారులతో కూడిన 20వ బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారుల ఆరు నెలల శిక్షణా కార్యక్రమం ఈ యేడాది జూన్ 14 న ప్రారంభమై డిసెంబర్ 30 తో ముగిసింది. అడవుల్లో విధులు, ఎదురయ్యే సవాళ్లు, రక్షణ, సంబంధిత అంశాలపై ఈ శిక్షణ ఉంటుంది. దీనిలో భాగంగా వెపన్ ట్రైనింగ్, సర్వే ట్రైనింగ్ లపై ప్రత్యేక శిక్షణ ఫారెస్ట్ అకాడెమీలో ఇవ్వడం జరిగింది.


శిక్షణ ముగింపులో జరిగిన పరీక్షలలో పి.రవి (అసిఫాబాద్ డివిజన్) ప్రధమ స్థానంతో పాటు, క్రీడల్లోనూ ప్రతిభ చూపి ఓవరాల్ ఆల్ రౌండర్ గా నిలిచారు. మారథాన్ పరీక్షలో 12కి.మీ. దూరాన్ని పురుషుల విభాగంలో ఆర్. మాన్యమయ్య,(1గం.3ని)మహిళల విభాగంలో జె.స్నేహశ్రీ(1గం.40ని)ప్రధమ స్థానాలు పొందారు.ఈ కార్యక్రమంలో పీ.వీ. రాజారావు, అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారి, అకాడమీ సంచాలకులు,డా. జీ.నర్సయ్య, అటవీ సంరక్షణ అధికారి(రిటైర్డ్), రామ మోహన్, కోర్స్ డైరెక్టర్, అకాడమీ అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T22:10:46+05:30 IST