శాఖల మధ్య సమన్వయంతో వన్యప్రాణుల వేట, అక్రమరవాణాకు అడ్డుకట్ట

ABN , First Publish Date - 2021-12-09T00:28:26+05:30 IST

వన్యప్రాణులు, వాటి శరీర భాగాలకు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ వాటి వేటకు, స్మగ్లింగ్ కు కారణం అవుతోందని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ తిలోత్తమ వర్మ అన్నారు.

శాఖల మధ్య సమన్వయంతో వన్యప్రాణుల వేట, అక్రమరవాణాకు అడ్డుకట్ట

హైదరాబాద్: వన్యప్రాణులు, వాటి శరీర భాగాలకు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ వాటి వేటకు, స్మగ్లింగ్ కు కారణం అవుతోందని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ తిలోత్తమ వర్మ అన్నారు. శాస్త్రీయత లేని నమ్మకాలతో, విచక్షణారహితంగా జరుగుతున్న వేట వల్ల అరుదైన జంతువులు అంతరించే దశకు చేరుకుంటున్నాయని, దీనికి అడ్డుకట్ట పడాలని వర్మ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలు, సంబంధిత శాఖల మధ్య సమన్యయం పెంపు, ప్రజల్లో అవగాహన కల్పించటంతో అటవీ నేరాలను అదుపులో పెట్టవచ్చని సూచించారు.అరణ్యభవన్ వేదికగా జరిగిన వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో 15వ సమన్వయ సమావేశంలో తిలోత్తమ వర్మ పాల్గొన్నారు.

 

పోలీస్, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, రెవెన్యూ ఇంటలిజెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, రైల్వేస్, సీఐఎస్ఎఫ్, ఫోరెన్సిక్, సీసీఎంబీ, జులాజికల్ సర్వే, బ్యూరో ఆఫ్ స్టాండర్స్, పోస్టల్ తదితర జాతీయ స్థాయి ఏజెన్సీల అధికారులతో వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ జరుగుతున్న తీరుతెన్నులు, అడ్డుకట్ట కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో నిఘా విభాగాలను బలోపేతం చేయటంతో పాటు, వివిధ వర్గాల్లో పర్యావరణ సమతుల్యత, వృక్ష జంతు జాతుల ప్రాధాన్యతను అవగాహన పెంచే కార్యక్రమాలను, ప్రచార వ్యాప్తిని పెంచాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో అటవీ జంతువుల వేట, స్మగ్లింగ్ జరుగుతున్న విధానాలు, మార్గాలపై తిలోత్తమ వర్మ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

 

ముఖ్యంగా వివిధ రూపాల్లో జరుగుతున్న జంతువుల వేట, రవాణాప వివిధ ఏజెన్సీల సెక్యూరిటీ, చెకింగ్ సిబ్బందికి అవగాహన పెంచాలని, సంబంధిత శాఖలు శిక్షణ ఇవ్వాలని తెలిపారు.తెలంగాణలో అటవీ రక్షణ, వేట నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పీసీసీఎఫ్ ఆర్. శోభ వివరించారు. సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయంతో పాటు, చెక్ పోస్టులను పెంచటం, పోలీస్ ఇంటలిజెన్స్ ను వాడుకోవటం, నమోదైన కేసుల్లో శిక్ష పడేలా చూడటం లాంటి చర్యలతో సమర్థవంతంగాపనిచేస్తున్నామని, టైగర్ రిజర్వులతో పాటు రిజర్వు అటవీ ప్రాంతాల్లో నిరంతరం నిఘా కోసం వాచర్ల బృందాలను ఏర్పాటు చేశామని, యాంటీ పోచింగ్, ప్లయింగ్ స్వ్కాడ్ విభాగాలను నెలకొల్సామని తెలిపారు.


 అటవీ సమీప గ్రామాల ప్రజలను చైతన్యవంతం చేసిఅటవీ నేరాల అదుపుకు వారి సహకారం తీసుకుంటున్నామని అన్నారు.టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసి (Toll Free No. 18004255364) అటవీ నేరాల ఫిర్యాదుకుపరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.సమావేశంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంకిరుపా శంకర్,  జాతీయ పులుల సంరక్షణ ఐ.జీఎన్.ఎస్.మురళిఅదనపు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) సిద్దానంద్కుక్రేటీరెవెన్యూ ఇంటలిజెన్స్ జాయింట్ డైరెక్టర్ వినయ్ కుమార్హైదరాబాద్రంగారెడ్డి చీఫ్ కర్జర్వేటర్లుఎం.జే. అక్బర్సునీతా భగవత్వైల్డ్ లైఫ్ ఓఎస్డీశంకరన్ఇతర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T00:28:26+05:30 IST