అప్పుల బాధతో ఇద్దరు రైతుల బలవన్మరణం

ABN , First Publish Date - 2021-12-25T08:22:20+05:30 IST

అప్పుల బాధ తట్టుకోలేక రాష్ట్రంలో శుక్రవారం ఇద్దరు రైతులు

అప్పుల బాధతో ఇద్దరు రైతుల బలవన్మరణం

వలిగొండ/జఫర్‌గడ్‌, డిసెంబరు 24: అప్పుల బాధ తట్టుకోలేక రాష్ట్రంలో శుక్రవారం ఇద్దరు రైతులు బలవన్మరణం చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మాందాపురానికి చెందిన తెనాలి వెంకటేశ్వర్‌రెడ్డి(38) 14 ఎకరాల్లో వరి, పత్తి, కూరగాయలను సాగు చేస్తుండేవాడు. పంటలు సరిగా పండక పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.12లక్షలకు చేరాయి. ఆ అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగాడు. జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం శంకర్‌తండాకు చెందిన లాకావత్‌ లాలు (50) వ్యవసాయం కలిసి రాక అప్పులెలా తీర్చాలనే ఆవేదనతో పురుగులమందు తాగాడు.

Updated Date - 2021-12-25T08:22:20+05:30 IST