మిర్యాలగూడలో అగ్నిప్రమాదం..

ABN , First Publish Date - 2021-11-09T13:29:58+05:30 IST

మిర్యాలగూడలోని టాకా రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. రాజరాజేశ్వరి, వెంకట రమణ వుడ్ వర్క్స్ షాపుల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాపుల్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో షాపుల్లో పెద్ద ఎత్తున్న

మిర్యాలగూడలో అగ్నిప్రమాదం..

నల్గొండ: మిర్యాలగూడలోని టాకా రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. రాజరాజేశ్వరి, వెంకట రమణ వుడ్ వర్క్స్ షాపుల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాపుల్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో షాపుల్లో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.2 లక్షల విలువైన టేకు చెక్కలు దగ్ధం అయినట్లు షాపు యజమానులు తెలిపారు.

Updated Date - 2021-11-09T13:29:58+05:30 IST