సీఐ కుటుంబానికి మిత్రుల బాసట
ABN , First Publish Date - 2021-05-21T09:30:22+05:30 IST
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీఐ దంపతుల కుటుంబానికి మిత్రులు, బ్యాచ్‌మేట్స్ బాసటగా నిలిచారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం

రూ.39.50 లక్షల ఆర్థిక సహాయం
పెన్‌పహాడ్, మే 20: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీఐ దంపతుల కుటుంబానికి మిత్రులు, బ్యాచ్‌మేట్స్ బాసటగా నిలిచారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన సుందరి లక్ష్మణ్.. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో అదనపు సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 8న లక్ష్మణ్, ఝాన్సీ దంపతులు కారు ప్రమాదంలో మృతిచెందారు. స్వగ్రామంలో గురువారం జరిగిన సంతాపసభలో.. లక్ష్మణ్‌తోపాటు ఎస్సైలుగా ఉద్యోగాలు సాధించిన 2009 బ్యాచ్‌మేట్స్ పాల్గొన్నారు. బ్యాచ్‌మేట్స్ 1100మంది నుంచి సేకరించిన రూ.35లక్షలు, 2012లో లక్ష్మణ్‌తో కలిసి పనిచేసిన సహచర ఎస్సైలు రూ.4.50లక్షలు.. మొత్తం రూ.39.50లక్షల విలువైన రెండు చెక్కులను తల్లి గౌరమ్మ, సోదరుడు రామారావు, బంధుమిత్రుల సమక్షంలో లక్ష్మణ్ పిల్లలు ఆకాంక్ష, సాహ్‌సకు వారు అందజేశారు.