భీమా కోరేగావ్‌ కేసులో నిందితుల విడుదలకు పోరాటం: అభయ్‌

ABN , First Publish Date - 2021-12-25T08:26:37+05:30 IST

భీమా కోరేగావ్‌ తప్పుడు కేసులో నిందితుల విడుదలకు ప్రజాస్వామికవాదులు,

భీమా కోరేగావ్‌ కేసులో నిందితుల విడుదలకు పోరాటం: అభయ్‌

భీమా కోరేగావ్‌ తప్పుడు కేసులో నిందితుల విడుదలకు ప్రజాస్వామికవాదులు, న్యాయకోవిదులు, హక్కుల సంఘాలు, అంతర్జాతీయ ప్రజా పోరాటాల లీగ్‌ (ఐఎల్‌పీఎస్‌) పోరాటానికి నడుం బిగించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 1న ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ముందు భారత సంతతికి చెందిన ప్రజల్ని కలుపుకొని ఐఎల్‌పీఎస్‌ వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 80 ఏళ్ల వయసులో వరవరరావుకు అనారోగ్య కారణాలపై కోర్టు బెయిల్‌ మంజూరు చేసి, ఆయన నివాసంలో బంధు, మిత్రులతో గడపడానికి మాత్రం అనుమతించకపోవడం.. ఆయనకు ఇది మరోరకంగా జైలు జీవితమేనని పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-25T08:26:37+05:30 IST